- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుల్డోజర్లపై వినూత్నంగా ‘బారాత్’.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు
ఓ పెళ్లి బృందం ఏకంగా బుల్డోజర్లపై బారాత్ తీసిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media) యుగంలో కొత్తదనం కోసం జనం చిత్రవిచిత్రమైన పనులు చేసి వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ఓ పెళ్లి బృందం చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా బుల్డోజర్లపై బారాత్ తీసి సెన్సేషన్ క్రియేట్ చేయాలని అనుకున్న వారికి ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా పెళ్లి కొడుకు గుర్రం మీదో, ఖరీదైన కారు మీదో ఊరేగింపుగా రావడం చూస్తుంటాం. కానీ యూపీలో జరిగిన ఓ పెళ్లిలో మాత్రం, పెళ్లి కొడుకుతో పాటు అతడి స్నేహితులు, బంధువులు వరుసగా నిలబెట్టిన బుల్‌డోజర్లపై ఎక్కి డ్యాన్స్‌లు చేస్తూ, కేరింతలు కొడుతూ ఊరేగింపుగా రోడ్లపైకి వచ్చారు. బుల్‌డోజర్లపై పెళ్లి బృందం చేసిన ఈ హంగామాను అక్కడి స్థానికులు తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. ‘యూపీ బుల్‌డోజర్ బారాత్’ వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి.
పోలీసుల చలాన్ దెబ్బ..
అయితే, బుల్డోజర్ బరాత్ వైరల్ వీడియోలు కాస్తా ఉత్తరప్రదేశ్ పోలీసుల కంట పడ్డాయి. పబ్లిక్ రోడ్లపై ఇలా బుల్‌డోజర్లను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడం వంటి కారణాల కింద పోలీసులు సీరియస్ అయ్యారు. వీడియో ఆధారంగా ఆ బుల్‌డోజర్ల నంబర్లను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు, సదరు యజమానులకు, పెళ్లి నిర్వాహకులకు భారీ మొత్తంలో ట్రాఫిక్ చలాన్ (Challan) విధించారు.
🚨 मुरादाबाद में बुल्डोजर वाली बारात वायरलदूल्हा @instagram रील बनाते हुए बुल्डोजर पर उड़ाता दिखा धुआं।बाराती भी बुल्डोजर पर चढ़कर करते रहे डांस और हुड़दंग।स्टंटबाजी के बीच जान जोखिम में डालती दिखी पूरी बारात।📍थाना छजलैट के उमरी कला गांव का वायरल मामला।@Uppolice… pic.twitter.com/shYhtfuJj9
— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) June 10, 2026






