- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర జనాభా 7.4 శాతం ముదిరాజ్ లే : మంత్రి వాకిటి శ్రీహరి
రాష్రంలో ముదిరాజ్ లను బీసీ- డీ నుంచి బీసీ -ఏ లోకి మార్చాలని గురువారం రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కలిసి విజ్ఞప్తి చేశారు.

దిశ, మక్తల్ : రాష్రంలో ముదిరాజ్ లను బీసీ- డీ నుంచి బీసీ -ఏ లోకి మార్చాలని గురువారం రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే లో బీసీల జనాభా 56.36 శాతం తేలగా అందులో ముదిరాజులు సామాజిక వర్గ జనాభా7.4 శాతం ఉన్నారని. ముదిరాజ్ జాతి ఇప్పటికీ అన్ని రంగాల్లో వెనకబడి ఉందని బీసీ-డీ నుంచి ఏ లోకి మారిస్తే భావితరాలకు న్యాయం జరుగుతుందని విజ్ఞప్తి లో తెలిపారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ముదిరాజులు పోటిరంగంలో సరైన రిజర్వేషన్ లేక ఉద్యోగాల్లో చదువుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలో అందుకునేందుకు బడి ఉన్నారని క్రింది స్థాయి నుంచి వచ్చిన తనకు మంత్రిగా కాకుండా ఒక ముదిరాజ్ బిడ్డ గా విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, కాసాని వీరేష్, బలరామ్ తదితరులు బీసీ కమిషన్ చైర్మన్ ను కలిసిన వారిలో ఉన్నారు.






