వాహనాల వేలం ద్వారా రూ.106410 ఆదాయం

by Kodari Anjali |

వేలంపాట ద్వారా రూ. 106410 ఆదాయం సమాకూరినట్లు ఎక్సైజ్ జిల్లా అధికారి లక్ష్మా నాయక్ తెలిపారు.

వాహనాల వేలం ద్వారా రూ.106410 ఆదాయం
X

దిశ, హుజూర్ నగర్ టౌన్: వేలంపాట ద్వారా రూ. 106410 ఆదాయం సమాకూరినట్లు ఎక్సైజ్ జిల్లా అధికారి లక్ష్మా నాయక్ తెలిపారు. ఎక్సైజ్ జిల్లా అధికారి తెలిపిన వివరాలు.. హుజుర్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన 11 వాహనాలకు గురువారం ఉదయం 11 గంటలకు హుజుర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. లక్ష్మా నాయక్ ఆద్వర్యంలో వేలం నిర్వహించారు. ఈ వాహనాలు వేలంలో 11 వాహనాలకు గాను 7 వాహనాలు మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన 4 వాహనాలను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. 7 వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం 48000 కాగా జీఎస్టీతో కలుపుకొని వేలంలో 106410 రూపాయలు ఆదాయం సమాకూరిందన్నారు. వేలంపాట వచ్చిన నగదు మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లు జిల్లా అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీసులు, పలువురు వాహన కొనుగోలుదారులు పాల్గొన్నారు.

Next Story