- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో ప్రభాస్ నెక్ట్స్ మూవీ.. హైప్ పెంచుతోన్న న్యూస్

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 వంటి చిత్రాలతో వరుస షూటింగ్‌లో పాల్గొంటున్న డార్లింగ్.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్‌తో చేతులు కలిపినట్లు టాక్. ధురంధర్, ధురంధర్ 2 చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ఆదిత్య ధర్ ప్రభాస్ కోసం ఓ పవర్ ఫుల్ కథ రాసినట్లు బాలీవుడ్ సినీ వర్గాల నుంచి సమాచారం. ప్రభాస్ - ఆదిత్య ధర్ - హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్‌లో ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు ఆదిత్య ధర్ ప్రభాస్‌ను రెండు సార్లు కలిసి కథపై చర్చించినట్లు సమాచారం.
అయితే స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు అవసరమని భావించిన ప్రభాస్, వాటిని సవరించి తీసుకురావాలని సూచించారట. ప్రస్తుతం ఆదిత్య ధర్ ప్రభాస్ సూచించిన మార్పులపై పని చేస్తున్నారని టాక్. స్క్రిప్ట్ పూర్తిగా సిద్ధమైన తర్వాత మరోసారి ఇద్దరూ సమావేశమై ఫైనల్ డిస్కషన్ జరపనున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇక మిగిలి ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రజెంట్ ఈ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.






