పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవల మెరుగుదల పై సూచనలు

by Jakkula.Mamatha |

నూతనంగా బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ పుట్ల శ్రీనివాస్ గురువారం ముషీరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవల మెరుగుదల పై సూచనలు
X

దిశ,రాంనగర్: నూతనంగా బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ పుట్ల శ్రీనివాస్ గురువారం ముషీరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కేంద్రంలోఅమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, అల్ట్రాసౌండ్ యూనిట్, ఎక్స్‌రే విభాగం, ల్యాబ్, టీబీ యూనిట్, ఔషధ పంపిణీ కేంద్రం తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశమైన డీఎంహెచ్‌ఓ పలు సూచనలు చేశారు. విధి నిర్వహణ సమయాలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, గర్భిణులకు మెరుగైన సేవలు అందించడం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) గుర్తింపు పరీక్షలు, టీకాల కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజారోగ్య సేవల బలోపేతానికి ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. తనిఖీ సందర్భంగా కేంద్రంలోని సౌకర్యాలు, సేవల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే మరింత మెరుగుదలకు అవసరమైన సూచనలు అందించారు.

Next Story