ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలి : సురవరం సతీమణి విజయలక్ష్మి

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆర్టీసీ కార్మికుల న్యాయ సమ్మతమైన డిమాండ్ ను వెంటనే అమలు పరచాలని ఏఐటీయూసీ జాతీయ నేత, సురవరం సతీమణి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలి :  సురవరం సతీమణి విజయలక్ష్మి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ఆర్టీసీ కార్మికుల న్యాయ సమ్మతమైన డిమాండ్ ను వెంటనే అమలు పరచాలని ఏఐటీయూసీ జాతీయ నేత, సురవరం సతీమణి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ ను ఆమె కలిసి వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. నిత్యం లక్షలాదిమంది ప్రయాణికులను వారి గమ్యాలకు క్షేమంగా చేరవేస్తూ, ప్రభుత్వానికి, సంస్థకు మంచి పేరు తెస్తున్నారని, ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తిలోదక విధానాలతో నిత్యం కార్మికులు అనేక ఇబ్బందులు, వేధింపులు, పనిభారంతో బస్సు స్టీరింగ్ పైన ఊపిరి వదులుతున్నారని ఆమె వాపోయారు. గత పాలకుల నియంతృత్వ పోకడలతో ఆర్టీసీ లో యూనియన్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. సమ్మె కాలంలో ప్రభుత్వం అంగీకరించిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ వెంటనే చేయాలని ఆమె కోరారు. అలాగే ఉమ్మడి జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీలకు గతంలో రద్దు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఆంజనేయులు, సురేష్, నాగార్జున, ఆంజనేయులు, అరుణ పాల్గొన్నారు.

Next Story