మెగా టోర్నీ ‘ఫిఫా ప్రపంచకప్ 2026’ షురూ.. పాప్ సింగర్ షకీరా హంగామా

by Kema Shiva Kumar |

ఫుట్‌బాల్ మహా సంగ్రామం 'ఫిఫా ప్రపంచకప్ 2026' గ్రాండ్‌గా ప్రారంభమైంది.

మెగా టోర్నీ ‘ఫిఫా ప్రపంచకప్ 2026’ షురూ.. పాప్ సింగర్ షకీరా హంగామా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోట్లది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘ఫిఫా పురుషుల ప్రపంచకప్ 2026’ (FIFA World Cup 2026) పోరుకు తెరలేచింది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ వినూత్న టోర్నీ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలవనుంది. తొలిసారిగా ఈ విడతలో 48 జట్లు పాల్గొంటుండగా, మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. మెక్సికో సిటీలోని ప్రతిష్టాత్మక ఎస్టాడియో అజ్టెకా మెక్సికో సిటీ స్టేడియం వేదికగా జరగనున్న ప్రారంభ మ్యాచ్‌లో గ్రూప్-A కి చెందిన ఆతిథ్య మెక్సికో (El Tri), సౌతాఫ్రికా (Bafana Bafana) జట్లు తలపడనున్నాయి.

గ్రాండ్‌గా ప్రారంభ వేడుకలు.. షకీరా ఆట, పాట

కాగా, భారత కాలమానం ప్రకారం ప్రారంభ వేడుకలు (Opening Ceremony) రాత్రి 11 నుంచి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రఖ్యాత పాప్ సింగర్ షకీరా (Shakira) తన ప్రదర్శనతో స్టేడియంను ఊపేయడానికి సిద్ధమైంది. ఆమెతో పాటు జె బాల్విన్, అలెజాండ్రో ఫెర్నాండెజ్ వంటి పలువురు అంతర్జాతీయ కళాకారులు ఈ వేడుకల్లో భాగం కానున్నారు. భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానులు పిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు టీవీల్లో యునైటెడ్ స్పోర్ట్స్ 1, యునైటెడ్ స్పోర్ట్స్ 2 ఛానెళ్లలో చూడవచ్చు. మొబైల్, ల్యాప్‌టాప్‌లలో లైవ్ స్ట్రీమింగ్ చూడాలనుకునే వారు ZEE5 (జీ5) యాప్‌లో వీక్షించవచ్చు.

Next Story