- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vehicles: ఒకదానితో ఒకటి మాట్లాడుకోనున్న వాహనాలు
ఈ టెక్నాలజీ ద్వారా రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు వాటి వేగం, స్థానం, బ్రేకింగ్ పరిస్థితి వంటి సమాచారాన్ని రియల్ టైమ్‌లో పరస్పరం పంచుకుంటాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను భారీగా తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాత్మక సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. వాహనాలు ఒకదానితో ఒకటి నేరుగా సమాచారాన్ని పంచుకునే ‘వాహనం-వాహనం కమ్యూనికేషన్’ (వీ2వీ) వ్యవస్థ కోసం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాలు వాటి వేగం, స్థానం, బ్రేకింగ్ పరిస్థితి వంటి సమాచారాన్ని రియల్ టైమ్‌లో పరస్పరం పంచుకుంటాయి. దీంతో ముందున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, రోడ్డుపై నిలిచిపోయిన వాహనం ఉండటం లేదా ప్రమాదం సంభవించే అవకాశం ఉండటం వంటి పరిస్థితుల్లో డ్రైవర్‌కు ముందుగానే హెచ్చరిక అందుతుంది. డ్రైవర్ కంటికి కనిపించని ప్రమాదాలను కూడా గుర్తించి అప్రమత్తం చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ టెక్నాలజీని ‘విప్లవాత్మక మార్పు’గా అభివర్ణిస్తూ, ఇది రోడ్డు ప్రమాదాలను 80 శాతం వరకు తగ్గించే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్ శాఖ ఇప్పటికే దీనికోసం ప్రత్యేక రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించింది. ప్రారంభ దశలో ఈ పరికరాన్ని కొత్తగా తయారయ్యే కార్లు, బస్సులు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాల్లో తప్పనిసరి చేసే అవకాశముంది. తర్వాత పాత వాహనాల్లో కూడా దీనిని అమర్చేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు తీసుకురానున్నారు. ఒక్కో పరికరం ధర సుమారు రూ.5,000 నుంచి రూ.7,000 మధ్య ఉండొచ్చని అంచనా. రాబోయే సంవత్సరాల్లో భారత రవాణా రంగంలో సేఫ్టీ టెక్నాలజీకి ఇది కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.






