బైక్‌లో నుంచి రూ. 50 వేల నగదు చోరీ..

by Kodari Anjali |   (  Updated:2026-06-11 15:30:17  IST  )

వైన్స్ ముందు బైకు నిలిపి షాపులోకి వెళ్లి వచ్చే లోపు బైక్ లో పెట్టిన 50 వేల రూపాయలు నగదు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

బైక్‌లో నుంచి రూ. 50 వేల నగదు చోరీ..
X

దిశ, చిట్యాల: వైన్స్ ముందు బైకు నిలిపి షాపులోకి వెళ్లి వచ్చే లోపు బైక్ లో పెట్టిన 50 వేల రూపాయలు నగదు గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తెలిసిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులను బ్యాంకులో డ్రా చేసుకొని తన బైక్లో పెట్టుకొని చిట్యాల పట్టణ కేంద్రంలోని ఉరుమోడ్ల రోడ్డులో ఉన్న వైన్స్ షాప్ వద్దకు వచ్చి వైన్స్ ముందు బైక్ నిలిపి వైన్స్ లోకి వెళ్లాడు. వచ్చే లోగా బైక్‌లో ఉన్న 50,000 నగదు, రెండు చెక్కులను దొంగలించినట్లు గుర్తించారు. వైన్స్ ముందు ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లోని నగదు తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. వెంటనే ఇట్టి విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Next Story