డిప్యూటీ ఈవో పోస్టులకు బీఈడీ, ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి : టీఎన్ఎస్ఎఫ్

by Nallavelli.Anjaneyulu |

డిప్యూటీ ఈవో పోస్టులకు బీఈడీ, ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయ‌కులు డాక్ట‌ర్ బాలు పేర్కొన్నారు.

డిప్యూటీ ఈవో పోస్టులకు బీఈడీ, ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి : టీఎన్ఎస్ఎఫ్
X

దిశ, కామారెడ్డి రూరల్ : డిప్యూటీ ఈవో పోస్టులకు బీఈడీ, ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయ‌కులు డాక్ట‌ర్ బాలు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ద్వారా విడుదల చేసిన డిప్యూటీ ఈవో పోస్టుల భర్తీలో విద్యార్హతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కల్పించడం సరియైన నిర్ణయం కాదని, ఈ పోస్టు పాఠశాల విద్యకు సంబంధించినది కాబ‌ట్టి బీఈడీ, ఏంఈడీ చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది అభ్యర్థులు ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నప్పటికీ వారికి అవకాశం కల్పించకుండా కనీస అర్హతగా పీజీని నిర్ణయించడం సరికాదని అన్నారు. 20 సంవత్సరాల క్రితం ఉన్న నియామక విధి విధానాలనే ప్రస్తుతం యధాతధంగా అమలుపరిచే ప్రయత్నం చేయడం భవిష్యత్ విద్యావ్యవస్థను ఇబ్బందులకు గురి చేస్తుందని అభిప్రాయప‌డ్డారు. వెంటనే ప్రభుత్వం నోటిఫికేషన్ లో మార్పులు చేపట్టాలని సూచించారు.

Next Story