నెల్లూరులో రోటీ ఫెస్టివల్.. రూ.10 కోట్లతో పనులు

by Vemula.Srinu Prasad |

415 సంవత్సరాల చారిత్రక ప్రాశస్త్యం కలిగి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్,అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. ..

నెల్లూరులో రోటీ ఫెస్టివల్.. రూ.10 కోట్లతో పనులు
X

దిశ, నెల్లూరు సిటీ: 415 సంవత్సరాల చారిత్రక ప్రాశస్త్యం కలిగి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్,అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. అనంతరం దర్గా ప్రాంగణంలో మంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 26 నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న ఈ రోటీ ఫెస్టివల్‌కు దేశ, విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, దర్గా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, వఖ్ఫ్ బోర్డు, మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో కలిపి మొత్తం 10 కోట్లతో పనులు చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ ఆధ్వర్యంలో డిజైన్లు ఫైనలైజ్ అయి, ఇప్పటికే టెండర్లు కూడా పూర్తయిన పనులను అత్యంత నాణ్యతతో, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Next Story