టీజర్‌తో ‘మకుటం’ సినిమాపై భారీ హైప్

by Chukka Sudharani |   (  Updated:2026-06-11 15:28:30  IST  )

కోలీవుడ్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మకుటం’.

టీజర్‌తో ‘మకుటం’ సినిమాపై భారీ హైప్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మకుటం’. ఆయన స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ఒక బలమైన కమర్షియల్ సినిమా అనుభూతిని కలిగిస్తోంది. అయితే.. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రోమోలు చూసినప్పుడు, విశాల్ వివిధ రూపాల్లో కనిపించడం వల్ల ఇది మరో మార్క్ ఆంటోని తరహా సినిమా అవుతుందేమోనన్న సందేహాలు వ్యక్తం కాగా.. టీజర్ మాత్రం ఆహ్లాదకరమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఢిపరెంట్‌గా ఆడియన్స్‌ను అలరిస్తోంది. ముఖ్యంగా చివర్లో మహిళల కోసం సాగే యాక్షన్ సన్నివేశం అద్భుతంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ టీజర్‌తో సినిమాపై సౌపర్ హైప్ క్రియేట్ చేసింది. ఆర్ బి చౌదరి సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. విశాల్ సరసన దుషారా విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Next Story