- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నౌకపై దాడిలో భారతీయుల మృతి.. డొనాల్డ్ ట్రంప్‌పై ఒవైసీ హాట్ కామెంట్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజెమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో సెట్టెబెల్లో (Settebello) వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడంపై ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అంతర్జాతీయ జలాల్లో జరుగుతున్న ఈ దాడులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాలే కారణమని ఒవైసీ ఆరోపించారు. ఈ దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత బాధ్యతారాహిత్యంగా (Reckless) వ్యవహరిస్తున్నారని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇబ్బందులు సృష్టిస్తున్నాయని కామెంట్ చేశారు. ఈ గొడవల వల్ల మన వాళ్లు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో ఒక్కసారి ఆలోచించాలని కేంద్రాన్ని కోరారు. ఉద్రిక్తతలకు సంబంధమే లేని మన ఓడలపై నిర్ధాక్షిణ్యంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో రక్షణ కల్పించడంలో అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తీవ్రంగా విఫలమైందని ఒవైసీ అన్నారు. హర్మూజ్‌లో తమ ఓడలపై దాడులు జరుగుతున్నాయని, ఆ ప్రాంతంలో ఎన్ని వాణిజ్య నౌకలు ప్రయాణిస్తున్నాయో అక్కడ కాపలా కాస్తున్న సెంట్‌కామ్‌కు తెలియదా అని అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు.






