- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీఎస్సీ ఫస్ట్ ర్యాంకర్‌కు దక్కని ఉద్యోగం: ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన
మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. మెగా డీఎస్సీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: మెగా డీఎస్సీ(Mega DSC)ని పారదర్శకంగా నిర్వహించామని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్(AP Education Department Secretary Kona Sasidhar) తెలిపారు. మెగా డీఎస్సీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) చేస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించామని తెలిపారు. డీఎస్సీ నిర్వహణకు 47 వేల ప్రశ్నలతో కొశ్చన్ బ్యాంకు తయారు చేశామని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రమేయం లేకుండా ప్రశ్నా పత్రాన్ని తయారు చేశామన్నారు. ప్రశ్నా పత్రం తయారీకి టీసీఎస్ ఐకాన్ సంస్థ సహకారం తీసుకున్నామని చెప్పారు. ప్రశ్నాపత్రం తయారు చేసే కంప్యూటర్ల పాస్ వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చేశామని పేర్కొన్నారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన నవీన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదని చెప్పారు. రూల్ 26 ప్రకారం వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే ఉద్యోగం ఇవ్వలేమని స్పష్టం చేశారు. టెట్ స్కోర్, డీఎస్సీ మార్కులు, మెరిట్ లిస్ట్ వెబ్ సైట్‌లో పొందుపర్చామని కోన శశిధర్ పేర్కొన్నారు.






