- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబుల్ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ జిల్లా మావల, కేఆర్కే కాలనీలో లబ్ధిదారుల కేటాయింపుకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.

దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మావల, కేఆర్కే కాలనీలో లబ్ధిదారుల కేటాయింపుకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఇళ్లకు సంబంధించిన విద్యుత్, తాగునీరు, శానిటేషన్‌తో పాటు మిగిలిన పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్థానిక గాంధీ పార్క్‌ను సందర్శించిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్కులో నిర్మిస్తున్న 7 ఫామ్ పాండ్స్, 5 బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్స్ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అలాగే చిన్నారులను ఆకట్టుకునే చిల్డ్రన్ ట్రైన్‌తో పాటు ఇతర మరమ్మతు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మెప్మా పీడీ రాజు, హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.






