- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో కొత్త పాలసీ: నీతి ఆయోగ్ మీట్‌లో చంద్రబాబు ప్రకటన
రాష్ట్రంలో మరో కొత్త పాలసీని తీసుకురాబోతున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పాపులేషన్ మేనేజ్ మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు....

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో కొత్త పాలసీని తీసుకురాబోతున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పాపులేషన్ మేనేజ్ మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గిందని, అందుకే కొత్త పాలసీని తీసుకురాబోతున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువగా ఉందన్నారు. భవిష్యత్తులో మానవవనరుల కొరత, వృద్ధాప్య సమస్యలు అధిగమించాలంటే కొత్త పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ తప్పనిసరి సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపైనా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రూ. 23 లక్షల కోట్ల వరకూ పెట్టుడులను ఆకర్షించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రాజెక్టు సంజీవని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీస్, అడ్వాన్స్‌డ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్‌ను అందుబాబులోకి తీసుకురాబోతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.






