- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుడిపల్లి మండల సమీకృత కార్యాలయాలకు స్థల పరిశీలన: ఎమ్మెల్యే
by Kodari Anjali |
గుడిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేపట్టేందుకు గురువారం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ స్థల పరిశీలన చేశారు.

X
పెద్ద అడిశర్లపల్లి (గుడిపల్లి): గుడిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణం చేపట్టేందుకు గురువారం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ స్థల పరిశీలన చేశారు. మండల కేంద్రంలో నాలుగున్నర ఎకరాల భూమిలో సమీకృతంగా ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను 15 కోట్లతో అత్యాధునికంగా కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో తాసిల్దార్, మండల పరిషత్, హరిత భవన్, కార్యాలయాలను ఏర్పాటు చేస్తారని, మొదటి అంతస్తులో ఐకెపి, మండల విద్య, వ్యవసాయ, పంచాయతీరాజ్, శిశు సంక్షేమ, విద్యుత్, ఉపాధి హామీ, రోడ్ల భవనాల కార్యాలయాలను ఏర్పాటు చేస్తారన్నారు. గుడిపల్లి మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు ఈయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు
Next Story






