- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: విద్యాశాఖ ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏపీలో వేసవి సెలవులు ముగిశాయి. రేపటి నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కాబతున్నారు. ఈ నేపథ్యంలోనే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమగ్ర వార్షిక ప్రణాళికను (Academic Calendar) ఏపీ విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలకు మొత్తం 229 పనిదినాలు (Working Days) ఉండనున్నాయి. ఇక ఆదివారాలు, ప్రభుత్వ, పండుగ హాలిడేస్ కలుపుకుని మొత్తం 87 రోజులను సెలవులుగా విద్యాశాఖ ప్రకటించింది. దసరా సెలవులు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 21 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 27, 2026 వరకు, ఇక సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి జనవరి 17, 2027 వరకు నిర్ణయించారు.
ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’..
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు, పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు విద్యాశాఖ ఈ ఏడాది కూడా కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి శనివారం పాఠశాలల్లో ‘నో బ్యాగ్ డే’గా ఉంటుంది. ఆ రోజు విద్యార్థులు పుస్తకాల బ్యాగ్‌లు లేకుండా స్కూలుకు హాజరై వినూత్న కృత్యాలు, ఆటపాటలు, క్విజ్, ఇతర నైపుణ్యాల సాధనలో పాల్గొంటారు. అత్యంత కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 2027 మార్చి 15 నుంచి మార్చి 31 వరకు నిర్వహించనున్నట్లుగా క్యాలెండర్‌లో స్పష్టం చేశారు. మార్చి నాటికే సిలబస్ పూర్తి చేసి, రివిజన్ పరీక్షలు ముగించేలా ఉపాధ్యాయులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.






