- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బొడ్రాయి ప్రతిష్ట స్థలాన్ని ఏకపక్షంగా నిర్ణయించడం సరైంది కాదు..
బొడ్రాయి ప్రతిష్ట స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకపక్షంగా నిర్ణయించడం సరైన విధానం కాదని మాజీ సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సారెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు.

దిశ, హుజూర్ నగర్ టౌన్: బొడ్రాయి ప్రతిష్ట స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకపక్షంగా నిర్ణయించడం సరైన విధానం కాదని మాజీ సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సారెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. గురువారం వారం మిట్టగూడెంలోని బొడ్రాయి స్థలాన్ని వారు పరిశీలించి మాట్లాడారు. మిట్టగూడెం ప్రాంతంలోని బొడ్రాయి స్థల నిర్ణయంపై గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రజాప్రతినిధులు కలిసి కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. గ్రామంలోని నిత్యం వ్యవసాయ పరికరాలతో వెళ్లే రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు ట్రాక్టర్లు, స్కూల్ బస్సులు వెళ్లేందుకు వీలుగా రైతుల ధాన్యం లారీలు వచ్చేటప్పుడు ఎలాంటి ఇబ్బందు లేకుండా ఉండేలా బొడ్రాయి స్థలాన్ని పరిశీలించి అందరి నిర్ణయం మేరకు స్థల ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేశారు.
అధికారులు చొరవ తీసుకోని..
మిట్టగూడెం ప్రాంతంలో అఖిలపక్షం నిర్ణయం లేకుండా సర్పంచ్, మరియు ఇతర అధికార పార్టీ నాయకులు ప్రధాన వీధిలో నడిరోడ్డుపై బొడ్రాయి ప్రతిష్ట స్థలాన్ని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వలన ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు నష్టం చేకూరుతుందన్నారు. వెంటనే ఏకపక్ష నిర్ణయాన్ని మార్చుకొని నడి బజార్లో వేసే బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చొరవ తీసుకోని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో భిఆర్ఎస్ నాయకులు సాముల బ్రహ్మారెడ్డి , బజారు బాద్యులు గోపిరెడ్డి రాజ మోహన్ రెడ్డి, గజ్జల గోవిందరెడ్డి,బీజేపీ గ్రామ శాఖ రేగళ్ల శ్రీనివాస్ గారు , సారెడ్డి మోహనరెడ్డి, పులిచర్ల వీరారెడ్డి,కనికి రెడ్డి, జి.వీర నాగిరెడ్డి, జి.బ్రహ్మారెడ్డి,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






