- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అన్నపూర్ణ సేవా కార్యక్రమం 10వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ
by Kodari Anjali |
తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ స్కీమ్‌కు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

X
దిశ, బాలానగర్: తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పి. రామచంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ స్కీమ్‌కు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు నెలకు సరిపడే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపారు. త్వరలో మరింత పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, దివ్యాంగులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Next Story






