- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ సీనియర్ నాయకులు
జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే కొన్ని ఆర్టీసీ బస్సులను తార్నాక మార్గంలో నడపాలని బీజేపీ సీనియర్ నాయకుడు వి.నర్సింగ్ రావు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ జె.శ్రీలతను కలిసి విజ్ఞప్తి చేశారు.

దిశ, సికింద్రాబాద్: జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే కొన్ని ఆర్టీసీ బస్సులను మెట్టుగూడ, శెనోయ్ నర్సింగ్ హోమ్, అడ్డగుట్ట, తుకారం గేట్ న్యూ బ్రిడ్జి, శాంతినగర్, లాలాపేట్ బ్రిడ్జి మీదుగా తార్నాక మార్గంలో నడపాలని బీజేపీ సీనియర్ నాయకుడు వి.నర్సింగ్ రావు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగారెడ్డి జిల్లా రీజినల్ మేనేజర్ జె.శ్రీలతను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుకారాం గేట్, శాంతినగర్, లాలపేట, అడ్డగుట్ట ప్రాంతాలకు చెందిన ప్రజలు, యాదగిరి గుట్టకు వెళ్లే భక్తులు, బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లే రోగులు, అలాగే ఘట్‌కేసర్, భువనగిరి ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రాంతాల ప్రజలు ముందుగా తార్నాక చేరుకుని అక్కడి నుంచి యాదగిరిగుట్ట బస్సు ఎక్కాల్సి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కొన్ని బస్సులను తార్నాక మార్గంలో మళ్లిస్తే వేలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. వినతి పై స్పందించిన రీజినల్ మేనేజర్ జె. శ్రీలత.. సంబంధిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించి ప్రయాణికుల అవసరాలను పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వి.నర్సింగ్ రావు, సి. నరేందర్ పాల్గొన్నారు.






