- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు కల్పించాలి..
బొగ్గు గని పెన్షన్ దారుల కనీస పెన్షన్‌ను గణనీయంగా పెంచి, ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో వారికి ఆర్థిక భద్రత కల్పించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.

దిశ, ఘట్కేసర్: బొగ్గు గని పెన్షన్ దారుల కనీస పెన్షన్‌ను గణనీయంగా పెంచి, ప్రస్తుత ధరల పెరుగుదల నేపథ్యంలో వారికి ఆర్థిక భద్రత కల్పించాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పోట్రూలకు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు సీపీఆర్‌ఎంఎస్ కార్డుల ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, గుర్తింపు పొందిన ఆసుపత్రుల సంఖ్యను పెంచాలని, వైద్య బిల్లుల రీయింబర్స్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ నాయకులు కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండంరాజు రామచందర్ రావు, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, ఉపాధ్యక్షులు కంచె బీరయ్య, కోశాధికారి మేడూరి విజయ బాబు పాల్గొన్నారు.






