దోమల నివారణకు పటిష్టమైన చర్యలు: డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు

by Kodari Anjali |

రానున్న వర్షాకాలంలో దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు అన్నారు.

దోమల నివారణకు పటిష్టమైన చర్యలు: డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు
X

దిశ, అల్వాల్: రానున్న వర్షాకాలంలో దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు అన్నారు. గురువారం సర్కిల్‌కు కేటాయించిన రెండు నూతన ప్యాకింగ్ మిషన్లకు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే సర్కిల్కు రెండు మిషన్లు ఉండగా అదనంగా మరో రెండు రావడంతో మొత్తం నాలుగు మిషన్లు అయినట్లు తెలిపారు. వీటి ద్వారా సర్కిల్ వ్యాప్తంగా దోమల నివారణ చర్యలు వేగవంతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఏఈ , వార్డు సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Next Story