- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
పొలంలో విద్యుత్ వైరును సరిచేస్తుండగా కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో చోటు చేసుకుంది

దిశ, తాండూరు రూరల్ : పొలంలో విద్యుత్ వైరును సరిచేస్తుండగా కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.... గ్రామానికి చెందిన తుంగల జగన్50) గ్రామంలో చిన్న మెకానిక్ పనులు చేస్తూ, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గ్రామానికి చెందిన నాయకులు అజ్మత్ అలీ తన పొలంలో పైపులైన్ పనులు చేయించుకోవడానికి జగన్‌ను తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న విద్యుత్ వైర్‌ను జగన్ సరిచేసేందుకు వెళ్లాడు. ప్రమాద వశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో జగన్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతునికి భార్య అనసూజమ్మ, కుమారుడు మారుతి, కూతురు పూజలు ఉన్నారు.






