- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ అసహనం.. అతి స్పందన ఏంటి: బీజేపీ నేతలపై వైఎస్ షర్మిల ఆగ్రహం
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కర్ణాటక స్థానం నుంచి ఆమెను రాజ్యసభకు కాంగ్రెస్ అధిష్టానం పంపుతున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల(AP Congress Chief Y.S. Sharmila)కు రాజ్యసభ(Rajyasabha) సీటు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కర్ణాటక(Karnataka) స్థానం నుంచి ఆమెను రాజ్యసభకు కాంగ్రెస్ అధిష్టానం పంపుతున్నట్లు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే అది అంతా ఉత్తదేనని తేలిపోయింది. అసలు ఆమెకు రాజ్యసభ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించకుండానే ప్రచారం జరిగిపోయింది. అయితే షర్మిలకు రాజ్యసభ ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు విమర్శలు కురిపించారు. మీనాక్షి నటరాజన్ నామినేషర్ తిరస్కరణ బీజేపీ కక్ష సాధింపు చర్య అంటూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు రాజ్య సీటు ఇవ్వకపోవడంతోనే ఆ అసహనంలో షర్మిల వాస్తవాలను పూర్తి విస్మరించినట్టున్నారంటూ బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలపై మరోసారి మండిపడ్డారు.
అతి స్పందన ఎందుకు?
‘‘రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయం. మధ్యలో మీ అసహనం ఏంటి? ఈ అతి స్పందన ఎందుకు?. 12 ఏళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెడితే, సమాధానం చెప్పే దమ్ములేక, అర్థం పర్ధం లేని అంశాలను మాట్లాడే మీ సంస్కారం ఏపాటిదో అర్థమైంది.’’ అంటూ ఆమె పేర్కొన్నారు. ‘‘ప్రజా ఉద్యమ గొంతుకగా ఎవరిది ఆరాటమో, ఎవరిది అసహనమో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. రాష్ట్ర అభివృద్ధికి అంకితభావం మాది. సహనాన్ని కోల్పోయి పిచ్చిప్రేలాపనలు మీవి. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పుండుమీద కారం చల్లే చేష్టలు బంద్ పెట్టి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన లేవనెత్తిన 12 వైఫల్యాల మీద సమాధానం చెప్పాలి. మీద మెరుగులు చూపించడం ఆపి లోపల పురుగుల సంగతి తేల్చాలి.’’ అని వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.






