- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాహెబ్ నగర్ డివిజన్‌లో పర్యటించిన హైడ్రా బృందం.. కారణం ఇదే!
by Jakkula.Mamatha |
ఎల్బీనగర్ నియోజకవర్గం, సాహెబ్ నగర్ డివిజన్‌లో వరద ముప్పు కాలనీలను హైడ్రా బృందం ఈ రోజు(గురువారం) సందర్శించారు.

X
దిశ, హస్తినాపురం: ఎల్బీనగర్ నియోజకవర్గం, సాహెబ్ నగర్ డివిజన్‌లో వరద ముప్పు కాలనీలను హైడ్రా బృందం ఈ రోజు(గురువారం) సందర్శించారు. వచ్చే వర్షం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, అలాగే అకాల వర్షాల వస్తే దానికి తగిన ఏర్పాట్లు ముందు జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేసే కార్యక్రమాలలో భాగంగా సాహెబ్ నగర్ డివిజన్ లోని మహాలక్ష్మి నగర్ ను హైడ్రా బృందం పరిశీలించింది. ఈ సందర్శనలో హైడ్రా విపత్తు మేనేజ్మెంట్ టీమ్, శ్రీనివాస్, ఉమా శంకర్, శ్యామ్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బృందావన్ మెడోస్ కాలనీ అధ్యక్షులు పొణుగుపాటి శశికాంత్, సౌభ్యనగర్ మాజీ అధ్యక్షులు నంద కిషోర్, మహా లక్ష్మి నగర్ కాలనీ వాసులు నాగమణి, సరిత, రాణి తదితరులు పాల్గొన్నారు.
Next Story






