- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువులో చేపలు పట్టబోయిన యువకుడి గల్లంతు..
by Kodari Anjali |
వీర్నపల్లి వెంకట రాయిని చెరువులో చేపలు పట్టబోయి యువకుడు చెరువులో గల్లంతయ్యాడు.

X
దిశ, ఎల్లారెడ్డిపేట: వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా గ్రామపంచాయతీకి చెందిన భూక్య ప్రశాంత్ అనే యువకుడు మరో యువకుడు గుగులోత్ సంతోష్ తో కలిసి గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో వీర్నపల్లి వెంకట రాయిని చెరువులో చేపలు పట్టబోయి చెరువులో గల్లంతయ్యాడు. గల్లంతయిన ప్రశాంత్ కోసం వీర్నపల్లి ఎస్సై బాబాయి చెరువు తండాకు వీర్న పెళ్లికి చెందిన యువకులు గురువారం సాయంత్రం ఐదున్నర గంటల వరకు గాలించిన ఆచూకీ లభించలేదు, భూక్య సంతోష్‌కు గత సంవత్సరమే వివాహామైంది. తల్లి గేలీబాయి, భార్య ఉన్నారు. వీర్నపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మరణించినట్లు పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు.
Next Story






