- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల పై నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

దిశ, మంచిర్యాల: ప్రభుత్వ విద్యా సంస్థలలో విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల పై నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం నస్పూర్ సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన అంగన్వాడీ శిక్షణ శిబిరానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం దిశగా ప్రత్యేక మెనూ ప్రవేశ పెట్టిందన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.
నాణ్యత ప్రమాణాలు పాటించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆహార భద్రత శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీ మహిళలకు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆయా కేంద్రాలకు సరఫరా చేసే ఆహారంపై కేంద్రాల్లో అవగాహన కల్పించాలని సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు ఎఫ్ఎస్ఎఐ నమోదు ధ్రువపత్రాలను అందించారు.






