- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధిక లాభాల పేరుతో రిటైర్డ్ ఉద్యోగికి రూ.10 లక్షల టోకరా..
రెట్టింపు లాభాలు వస్తాయనే నమ్మకంతో రిటైర్డ్ ఉద్యోగి ఓ వ్యక్తి చేతిలో మోసపోయాడు.

దిశ, మేడిపల్లి 11/01: అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.10 లక్షలు పెట్టుబడిగా తీసుకుని, తిరిగి చెల్లించకుండా మోసం చేసిన ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌పురి కాలనీకి చెందిన బెలే ప్రభాకర్ (63) 2023లో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నిమిషా బిజినెస్ క్లబ్ ఇన్వెస్టర్ సమ్మిట్-2023 కార్యక్రమానికి హాజరు కాగా, కిచెన్ రెస్టారెంట్ చైన్ ప్రాజెక్ట్‌ను లాభదాయక పెట్టుబడి అవకాశంగా ప్రచారం చేయడంతో ఆయన ఆసక్తి చూపారు.
పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు...
ఈ క్రమంలో ప్రాజెక్ట్ నిర్వాహకుడిగా పరిచయమైన తార్నాకకు చెందిన బాల నరేంద్ర, రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి ఏడాది రెట్టింపు లాభాలు వస్తాయని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని మాటలు నమ్మిన ప్రభాకర్, తన పదవీ విరమణ నిధుల నుంచి విడతల వారీగా రూ.10 లక్షలు పెట్టుబడిగా చెల్లించినట్లు తెలిపారు. అయితే మూడేళ్లు గడిచినా ఎలాంటి లాభాలు అందకపోగా, పెట్టుబడిగా చెల్లించిన సొమ్ము కూడా తిరిగి రాలేదని బాధితుడు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు బాల నరేంద్రను సంప్రదించినప్పటికీ, వివిధ కారణాలు చెబుతూ కాలయాపన చేయడమే తప్ప డబ్బులు తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ప్రభాకర్ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






