అధికారులు కాంగ్రెస్​ పార్టీ తొత్తులుగా మారారు: ఎమ్మెల్యే

by Kodari Anjali |

అధికారులు కాంగ్రెస్​ పార్టీ తొత్తులుగా మారారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు.

అధికారులు కాంగ్రెస్​ పార్టీ తొత్తులుగా మారారు: ఎమ్మెల్యే
X

దిశ, కూకట్​పల్లి: అధికారులు కాంగ్రెస్​ పార్టీ తొత్తులుగా మారారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్​లో గురువారం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి నాయకుల ప్రయోజనాలకే ప్రభుత్వ అధికారులు ప్రాముఖ్యత ఇస్తున్నారని, నేడు అధికారులు కాంగ్రెస్​ పార్టీ తొత్తులుగా మారారని ఆరోపించారు. అధికారులు ప్రజల ఆగ్రహానికి గురి కావద్దని హితవు పలికారు. బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన ఫ్లైఓవర్​లు, అండర్​ పాస్​ బ్రిడ్జి నిర్మాణాలు, నాలాల అభివృద్ధి తప్ప కాంగ్రెస్​ పార్టీ ఏర్పడిన రెండున్నర ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి పని ముందుకు వెళ్లలేదని అన్నారు.

ప్రజలు గట్టి బుద్ది చెబుతారు.

గతంలో చేసిన పనులకు మళ్లి శంకుస్థాపనలు చేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని అన్నారు. మూసీ నది ప్రక్షళణ పేరుతో గత రెండున్నర ఏళ్ల నుంచి చెప్పడమే తప్ప చేసింది ఏమి లేదని, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేని అన్నారు. మహిళలకు తులం బంగారం ఇస్తామని అబద్దపు హామీలు చెప్పి అధికాంలోకి వచ్చి రోజులు గడుస్తున్న హామీలు నిలబెట్టుకోవడం లేదని అన్నారు. రాబోయే రోజులలో ప్రజలు గట్టి బుద్ది చెబుతారని అన్నారు. బీఆర్​ఎస్​లో ఉండి కాంగ్రెస్​ తొత్తులుగా మారి, ధైర్యం లేక ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని స్థితిలో కొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో రాజీనామాలు చేసి తిరిగి గెలవాలని సవాల్​ విసిరారు. రాబోయే రోజులలో ఇటువంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Next Story