- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహలకు చెక్.. ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ విలక్షణ నటుడు సూరి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘మండాడి’.

దిశ, సినిమా: కోలీవుడ్ విలక్షణ నటుడు సూరి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘మండాడి’. టాలీవుడ్ వెర్సటైల్ హీరో సుహాస్ ఈ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన పత్రీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా విడుదల కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆగస్టు 13న రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఊహగణాలకు తెర దించుతూ మూవీ విడుదలపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ‘మండాడి’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయనుంది అని తెలుపుతూ.. ‘సముద్రం ఒడిలో పుట్టిన కథ ప్రపంచాన్ని జయించడానికి సిద్ధంగా ఉంది’ అంటూ ఓ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్ వంటి హేమాహేమీలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






