- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మిన బంధువులే నట్టేట ముంచారు.. వృద్ధురాలు తీవ్ర ఆవేదన
దగ్గరి బంధువులని నమ్మితే 5 ఎకరాల వ్యవసాయ భూమిని అన్యక్రాంతం చేసి తనను మోసం చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.

దిశ, ఖైరతాబాద్: దగ్గరి బంధువులని నమ్మితే 5 ఎకరాల వ్యవసాయ భూమిని అన్యక్రాంతం చేసి తనను మోసం చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో భువనగిరికి చెందిన వృద్దురాలు పోతంశెట్టి శ్రీవాణి మాట్లాడుతూ.. తన సమీప బంధువైన పోతంశెట్టి వెంకటేశ్వర్లు తనకు పూర్వీకుల నుంచి రావాల్సిన 5 ఎకరాల వ్యవసాయ భూమిని ఇతరులకు తన సమ్మతి లేకుండా విక్రయించాడని ఆరోపించారు. తన పూర్వీకుల ఆస్తిని(వ్యవసాయ భూమిని)ప్లాట్లు చేసి విక్రయించి తనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని వాపోయారు. తన వాటా గురించి ప్రశ్నిస్తే నేడు రేపు అంటూ కాలయాపన చేయడంతో అతని ఇంటికి వెళ్లగా తన పై పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వెంకటేశ్వర్లుకు రాజకీయ ప్రాబల్యం ఉండటంతో పోలీసులు తన గోడు వినిపించుకోకుండా అతని వైపే నిలుస్తు నన్ను ఇబ్బందులకు గురి చేశారని బోరున విలపించారు. సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నానని, ముఖ్యమంత్రి తన సమస్యను పరిష్కారం చూపుతారని హైదరాబాద్ కు వచ్చానని తెలిపారు. తన పూర్వీకుల ఆస్తి తనకు ఇవ్వకుండా మోసం చేస్తున్న తన బంధువు వెంకటేశ్వర్లు పై చట్టరీత్య చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పోలీసులు ఉన్నతాధికారులను ఆమె కోరారు. సమావేశంలో ఆమెతో పాటు ఆమె కూతురు అనూహ్య, అల్లుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.






