- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి పై జిల్లా అడిషనల్ ఆకస్మిక తనిఖీ
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ నాయక్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు.

దిశ, చిట్యాల : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ నాయక్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీల్లో భాగంగా స్టేషన్‌లో అమలవుతున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ ( 2.0) సాఫ్ట్‌వేర్ పనితీరుపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ డి. మల్లేష్, ఎస్సై పోచంపల్లి సతీష్ స్టేషన్ పరిధిలో సీసీటీఎన్ఎస్ ద్వారా జరుగుతున్న ఆన్‌లైన్ సేవల పురోగతిని, కేసుల నమోదు విధానాన్ని అడిషనల్ ఎస్పీ కి కంప్యూటర్ స్క్రీన్ ద్వారా ప్రత్యక్షంగా వివరించారు. స్టేషన్‌లో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సీసీటీఎన్ ఎస్ యూఐ దర్యాప్తులో ఉన్న కేసుల రికార్డులను అడిషనల్ ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం టెక్ టీం రైటర్లకు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేస్తూ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అన్ని యుi కేసుల ఫైళ్లను, నిర్దేశించిన లక్ష్య సమయం లోపు పూర్తి చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా సీసీటీఎన్ఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ రికార్డులను ఎల్లప్పుడూ పారదర్శకంగా, అప్‌డేట్‌గా ఉంచాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ స్టేషన్ టెక్ టీం రైటర్స్ మమత, నాగమణి, లాల్ సింగ్ పాల్గొన్నారు.






