అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయింపు

by Nallavelli.Anjaneyulu |

అనుమతులు లేకుండా కొందరు శ్రీశైలం- హైదరాబాద్ నేషనల్ హైవే (ఎన్ హెచ్ 765) లతీపూర్ గ్రామ (డిండి) కట్టమైసమ్మ ఆలయం వద్ద రోడ్డు పై బైఠాయించి వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించినందుకు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

అనుమతులు లేకుండా రోడ్డుపై బైఠాయింపు
X

దిశ, ఉప్పునుంతల : అనుమతులు లేకుండా కొందరు శ్రీశైలం- హైదరాబాద్ నేషనల్ హైవే (ఎన్ హెచ్ 765) లతీపూర్ గ్రామ (డిండి) కట్టమైసమ్మ ఆలయం వద్ద రోడ్డు పై బైఠాయించి వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించినందుకు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఉప్పునుంతల ఎస్సై మహేష్ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్రకారం.. లతీపూర్ గ్రామ శివారులోని (డిండి)కట్ట మైసమ్మ ఆలయం వద్ద కుమ్మరి కులస్తులు కొబ్బరికాయల వ్యాపారంతోపాటు పూర్తి హక్కులు మాకే చెందాలని డిమాండ్ చేస్తూ ముందస్తుగా ఎలాంటి అనుమతులు పొందకుండా రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వాహనదారులకు అంతరాయం కలిగించారు. అందుకే లాతిపూర్ కుమ్మర కులస్తులైన దేవర్ల మల్లయ్య, దేవర్ల రమేష్, దేవర్ల రవి, దేవర్ల వెంకటేష్, దేవర్ల అంజనమ్మ, దేవర్ల సైదమ్మ, దేవర్ల అశ్విని, దేవర్ల రమణమ్మ, దేవర్ల మణెమ్మ, దేవర్ల సుధాకర్, దేవర్ల సాయిలు, దేవర్ల విజయ్ పై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అనుమతులు లేకుండా ధర్నాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Next Story