- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొల్లాచి షెడ్యూల్ కంప్లీట్.. ‘మెగా 158’ నుంచి ఫొటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకోగా.. తాజాగా సెకండ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చిత్ర బృందం. మెగా 158కు సంబంధించిన సెకండ్ షెడ్యూల్ షూటింగ్ పొల్లాచిలో పూర్తైనట్లు తెలుపుతూ ఫొటోలు పంచుకున్నారు మేకర్స్. ‘మెగా158 పొల్లాచి షెడ్యూల్ పూర్తయింది. చిరుబాబీ2 చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కూడిన ముఖ్యమైన భాగాలను చిత్రీకరిస్తూ, అత్యంత ఉత్సాహభరితమైన షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నారు’ అంటూ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ సినిమాలో చిరంజీవి కూతురుగా యంగ్ హీరోయిన్ అనశ్వర రాజన్ నటిస్తుండగా, నివేతా పేతురాజ్, రచితా రామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్.






