బీజేపీ వనపర్తి జిల్లా అధికార ప్రతినిధిగా నక్క మహేష్ యాదవ్ నియామకం

by Nallavelli.Anjaneyulu |

భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు దుప్పల్లి నారాయణ నక్క మహేష్ యాదవ్ ను బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించారు.

బీజేపీ వనపర్తి జిల్లా అధికార ప్రతినిధిగా నక్క మహేష్ యాదవ్ నియామకం
X

దిశ, వనపర్తి : భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు దుప్పల్లి నారాయణ నక్క మహేష్ యాదవ్ ను బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా అధికార ప్రతినిధి గా నియమితులైన నక్క మహేష్ యాదవ్ మాట్లాడుతూ గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం జిల్లా అధికార ప్రతినిధి బాధ్యతలను అప్పగించడం పట్ల ఆనందం వ్యక్తం చేసారు.బీజేపీ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత ఉత్సాహంతో పని చేస్తానన్నారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. జిల్లా అధ్యక్షులు దుప్పల్లి నారాయణ, పార్టీ నాయకత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన నక్క మహేష్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలిపారు.

Next Story