- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేర ప్రవృత్తిని తగ్గించేందుకే ఫీల్ ది జైల్
నేటి సమాజంలోని యువతీ, యువకులు, విద్యార్థినీ, విద్యార్థులలో నేరపూరితమైన ఆలోచనలు రాకుండా, మానవతా విలువలు గల సమాజాన్ని ఏర్పరిచేలా ఉండేందుకే ఫీల్ ద జైలు కార్యక్రమాన్ని ప్రారంభించామని చంచల్‌గూడ జైలు సూపరిండెంట్ శివకుమార్ గౌడ్ అన్నారు.

దిశ, ఖైరతాబాద్: నేటి సమాజంలోని యువతీ, యువకులు, విద్యార్థినీ, విద్యార్థులలో నేరపూరితమైన ఆలోచనలు రాకుండా, మానవతా విలువలు గల సమాజాన్ని ఏర్పరిచేలా ఉండేందుకే ఫీల్ ద జైలు కార్యక్రమాన్ని ప్రారంభించామని చంచల్‌గూడ జైలు సూపరిండెంట్ శివకుమార్ గౌడ్ అన్నారు. గురువారం చంచల్‌గూడ జైలులోని జైలు మ్యూజియం, ఫీల్ ది జైలు కేంద్రాన్ని యూత్ ఫర్ యాంటీ కరప్షన్, ముందడుగు సంస్థలు సందర్శించాయి.
బ్రిటిష్ కాలం నుంచి నిజాం కాలం వరకు ఉన్న జైలు నమూనాలు, అప్పటి శిక్షలు అద్భుతంగా అందరికి అర్థమయ్యే రీతిలో మ్యూజియంలో పొందబరిచారు. ఫీల్ ది జైలు కేంద్రంలో ఖైదీ జీవన విధానం, జైలు స్థితిగతులు, జైలు జీవితం ఏలా ఉంటుందనే విషయాలు అన్నితెలుసుకునే విధంగా ఉందని పౌండర్ రాజేంద్ర పల్నాటి అన్నారు. నేటి విద్యార్థినీ, విద్యార్థులకు, యువతకు ఈ రెండింటిపై పూర్తి అవగాహన చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొన్నె దేవేందర్, కొమటి రమేష్‌బాబు, గీతా రెడ్డి, డా. స్నిగ్థ, డా. శ్రీవాణి, ప్రగతి, గంగాధర్, ప్రశాంత్, నర్సింగం, అక్షయ్ కుమార్, గిరి పోతరాజు, వేణు, అద్వైత తదితరులు పాల్గొన్నారు.






