- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కస్తూరి ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
by Kodari Anjali |
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సుమారు రూ.4.5 లక్షల వ్యయంతో ఆధునీకరించి కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు.

X
దిశ, మర్రిగూడ: మండలంలోని దామెర భీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సుమారు రూ.4.5 లక్షల వ్యయంతో ఆధునీకరించి కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో తీర్చిదిద్దిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చరణ్‌ను గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి జి. శారద మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి శ్రీ చరణ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. అలాగే విద్యార్థుల సంఖ్య పెంపు, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లా అలివేలు కృష్ణయ్య, ఉపసర్పంచ్ లింగయ్య, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story






