- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు అలర్ట్.. రేపటి నుంచే స్కూళ్లు ప్రారంభం
రాష్ట్రంలో బడిబాటకు వెళయింది. శుక్రవారం నుంచి స్కూలు గంట మోగనుంది. విద్యార్థులు బ్యాగు తగిలించుకుని మళ్లీ తరగతులకు హాజరుకానున్నారు. నేటితో వేసవి సెలవులు ముగియడంతో ఇంతకాలం ఇంటి దగ్గర ఉన్న విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. ...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బడిబాటకు వెళయింది. శుక్రవారం నుంచి స్కూలు గంట మోగనుంది. విద్యార్థులు బ్యాగు తగిలించుకుని మళ్లీ తరగతులకు హాజరుకానున్నారు. నేటితో వేసవి సెలవులు ముగియడంతో ఇంతకాలం ఇంటి దగ్గర ఉన్న విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. అటు అధికారులు సైతం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభంకానున్నట్లు ప్రకటించారు. 2026-2027 ఏడాదికి పాఠశాల క్యాలెండర్‌ను సైతం విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజులు పాటు పని చేయనున్నట్లు వెల్లడించారు. మరో 87 రోజులు సెలవు రోజులుగా తెలిపారు. పనిలో పనిగా పరీక్షల షెడ్యూల్స్‌నూ విడుదల చేశారు. ఇక్కడ ఇలా ఉంటే తెలంగాణలో మాత్రం సోమవారం నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని అక్కడి విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
Next Story






