విజయ్ దేవరకొండకు జోడీగా మానస వారణాసి

by Chukka Sudharani |

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’.

విజయ్ దేవరకొండకు జోడీగా మానస వారణాసి
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌లో వేగం పెంచింది. ఇప్పటికే షూటింగ్ విజయవంతంగా 102 రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా దాదాపు 20 రోజుల షూటింగ్ మిగిలి ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 11న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేయడానికి అంతా సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ.. ఈ ప్రాజెక్టు అనంతరం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ బజ్ నెట్టింట సందడి చేస్తుంది. ఇందులో మానస వారణాసిని హీరోయిన్‌గా ఎంపిక చేశారట చిత్ర బృందం. ఇప్పటికే కథ వినిపించగా మానస ఓకే చేసినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. ‘దేవకీ నందన వాసుదేవ, కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ హోమ్లీ బ్యూటీ.. ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తుందనే వార్తలు వైరల్ అవుండగా.. ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story