- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీవీఆర్ఐటీలో “మానవ సంక్షేమం కోసం సాంకేతికత వినియోగం” పై అంతర్జాతీయ సదస్సు
నర్సాపూర్ బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి 5వ ఐఈఈఈ వైర్లెస్, యాంటెన్నా అండ్ మైక్రోవేవ్ సింపోజియం (వామ్స్ -2026) రెండవ రోజు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి 5వ ఐఈఈఈ వైర్లెస్, యాంటెన్నా అండ్ మైక్రోవేవ్ సింపోజియం (వామ్స్ -2026) రెండవ రోజు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో భారతదేశంతో పాటు విదేశాల నుంచి వచ్చిన పరిశోధకులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా దేశానికి చెందిన ప్రొఫెసర్ .ఫిల్ వెనిజియా, డా. సుధాకర్ కె. రావు, డా.సతీష్ శర్మ డా. జావాద్ సిద్ధికి , కెనడా, ప్రొ. దేసోమందేసిమ్ , తైవాన్ డా. సి.జె. రెడ్డి, ప్రొఫెసర్ ఫ్రాన్సెస్కో పి. ఆండ్రియుల్లీ, ప్రొఫెసర్ జవాద్ సిద్ధిఖీ, కెనడా, ప్రొఫెసర్ డిబాతోష్ గుహా, కోల్‌కత్తా పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “ ఐఈఈఈ మానవ సంక్షేమం కోసం సాంకేతికత వినియోగం”పై ప్రత్యేక ఆసక్తి కలిగించే యూవ విద్యార్థుల కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా విద్యార్థులకు “విద్యార్థులలో సమానత్వాన్ని ప్రోత్సహించే అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు విశాఖపట్నంలోని డా. వేదుల సమీర్ చక్రవర్తి, బీవీఆర్ఐటీ నర్సాపూర్ కు చెందిన డా. జయశ్రీ దాస్ మరియు డా. సతీష్ రామా చౌదరి నాయకత్వం వహించారు. పాఠశాల విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, ఇంజనీరింగ్, ఆవిష్కరణలు మరియు సామాజిక బాధ్యతలపై ఆసక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను రూపొందించారు.ఈ కార్యక్రమం ద్వారా అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహాల వినియోగం, , సైనిక మరియు రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, విద్యా, ఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతల పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో. కళాశాల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ దూబే విభాగాల అధిపతులు, అధ్యాపకులు అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ బి. బాపిరాజు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






