- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్యానాను నేరాల అగ్నిగుండంగా మార్చారు.. కాంగ్రెస్ ఫైర్
హర్యానా రాష్ట్రంలోని హన్సీలో పట్టపగలే రోడ్డుపై హత్య జరిగింది. ఓ జిమ్ ట్రైనర్ రోడ్డు పక్కన వ్యాయామం చేస్తున్న సమయంలో ఇద్దరు బైక్ వచ్చి అతడిని తుపాకీతో కాల్చి చంపేశారు. పక్కన జిమ్ కు వచ్చే సభ్యులు వ్యాయామం చేస్తున్న సమయంలోనే ఈ దారుణం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: హర్యానా రాష్ట్రంలోని హన్సీలో పట్టపగలే రోడ్డుపై హత్య జరిగింది. ఓ జిమ్ ట్రైనర్ రోడ్డు పక్కన వ్యాయామం చేస్తున్న సమయంలో ఇద్దరు బైక్ వచ్చి అతడిని తుపాకీతో కాల్చి చంపేశారు. పక్కన జిమ్ కు వచ్చే సభ్యులు వ్యాయామం చేస్తున్న సమయంలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జిమ్ ట్రైనర్ పై కాల్పుల వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇది హర్యానాలోని జంగిల్ రాజ్ కు నిదర్శనం అని పేర్కొంది. బీజేపీ హయాంలో హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు లాంటి దారుణాలు సర్వసాధారణం అయిపోయాయని మండిపడింది. ప్రజలు భయంతో, అభద్రతాభావంతో ఉన్నారని, బీజేపీ అసమర్థ వ్యవస్థ తమను ఏమీ చేయలేదని తెలిసినందుకు నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానాను నేరాల అగ్నిగుండంలోకి నెట్టివేసినందుకు బీజేపీని ఎన్నటికీ క్షమించలేమని పేర్కొంది.






