మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం.. మ‌గ‌వారికి చార్జీల మోత : ఎంపీ డీకే అరుణ

by Nallavelli.Anjaneyulu |

గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చక కొన్ని రకాల బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి మగవాళ్ళకు చార్జీల్లో మోతతో ఇబ్బంది పెట్టిన ఘనత రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పేర్కొన్నారు.

మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం.. మ‌గ‌వారికి చార్జీల మోత :  ఎంపీ డీకే అరుణ
X

దిశ‌, మ‌క్త‌ల్ : గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చక కొన్ని రకాల బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి మగవాళ్ళకు చార్జీల్లో మోతతో ఇబ్బంది పెట్టిన ఘనత రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పేర్కొన్నారు. మండల పరిధిలోని సామన్ పల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం 20 లక్షలతో నిర్మించిన పంచాయతీ బిల్డింగ్ 5 లక్షల సీసీ రోడ్డు కు రిబ్బన్ కటింగ్ చేసి మాట్లాడారు. సోనియమ్మ జన్మదినాన ఆరు హామీలను అమలు చేసి ప్రారంభింస్తామని చెప్పిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలిపారు. ఉచిత బస్సు సౌకర్యం అంటూ ఊరించి ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ ల‌కే ప్రయాణం పరిమితి చేశాడని తెలిపారు. మ‌రోవైపు రెండింత‌లు చార్జీలు పెంచి మగవారికి ఇబ్బంది చేశాడని రాష్ట్రంలో రోడ్లపై తక్కువ బస్సులను తిప్పడం వల్ల ప్రయాణికులందరికీ బస్సులో ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆమె అన్నారు.


మారుమూల గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్రామాలకు ఆర్టీసీ బస్సులను తిప్పకుండా ప్రజలకు ఇబ్బంది చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు రెండున్నర వేలు ఇస్తామని చెప్పి 30 నెలలు కావస్తున్న నేటికీ ఆ పథకం అమలు లేదని వృద్ధులకు, వికలాంగులకు ఆసరా పింఛన్లు పెంచుతామన్న హామీ నేటికీ అమలు కాలేదని.. పంచాయతీల అభివృద్ధికి నెల నెల నిధులు. స్మశాన వాటికలకు సీసీ రోడ్లు, అంగ‌న్ వాడీ, గ్రామపంచాయతీ బిల్డింగ్, మధ్యాహ్న భోజన పథకానికి ఉచిత బియ్యం, బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకుండా దాచేస్తున్నదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వరి, ఉప సర్పంచ్ నర్సింహులు,బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story