పాఠశాల మార్గం బురదమయం.. మంత్రి సవిత కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా వెనకబడిపోయి ఉన్నాయి. అభివృద్ధికి ఆమాడ దూరంలోనే ఉన్నాయి. కనీసం రోడ్ల సౌకర్యం కూడా లేకుండా ఉన్నాయి. ..

పాఠశాల మార్గం బురదమయం.. మంత్రి సవిత కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా వెనకబడిపోయి ఉన్నాయి. అభివృద్ధికి ఆమాడ దూరంలోనే ఉన్నాయి. కనీసం రోడ్ల సౌకర్యం కూడా లేకుండా ఉన్నాయి. దీంతో ఆస్తత్రికి వెళ్లాలన్నా, స్కూలు వెళ్లి చదువుకోవాలన్నా అష్టకష్టాలు తప్పడం లేదు. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఈ వీడియో ఇందుకు నిదర్శనంగా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా పోలేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు చదువుకోవాలంటే సమీపంలోని రాచూపల్లికి ప్రతి రోజూ వెళ్లాల్సిందే. అయితే గ్రామం నుంచి మట్టి రోడ్డులో ప్రయాణం చేసి బడికి వెళ్లాలి. విడి రోజుల్లో ఓకే గాని వర్షం పడిందంటే చాలు ఆ మార్గం బురదమయం అయిపోతుంది.

దీంతో విద్యార్థులు ఆ బురదలోనే నడుచుకుంటూ స్కూలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సైకిల్ పై వెళ్లే విద్యార్థులయితే ఇక నరకయాతన తప్పదు. సైకిల్‌పై నుంచి దిగి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. సైకిల్‌ను నెట్టుకుంటే టైర్లకు బురద అంటుకుని తిప్పలు పడుతూనే స్కూలు‌కు వెళ్లాలి. లేదంటే ఆ రోజు అప్సెంట్ పడిపోయినట్లే. ఇలా వర్షం పడిన ప్రతిసారి ఇదే దరువు. దీంతో విద్యార్థులు పడుతున్న కష్టాలను మంత్రి సవితో పంచుకున్నారు. వినతి పత్రం రూపంలో ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి రోడ్డును మంజూరు చేశారు. ఇందుకు రూ.1.72 లక్షలను కేటాయించారు. త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story