- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధం.. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
షార్ట్ సర్క్యూట్‌తో రెండు ఇళ్లు దగ్ధం.. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
by Jakkula.Mamatha |
ఆదిలాబాద్ పట్టణంలోని కే.ఆర్.కే కాలనీలో గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా కనపర్తి రాజన్న, గణేష్ అన్నదమ్ములకు చెందిన రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

X
దిశ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని కే.ఆర్.కే కాలనీలో గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా కనపర్తి రాజన్న, గణేష్ అన్నదమ్ములకు చెందిన రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధితులకు ఇళ్ల మంజూరు కోసం కృషి చేయడంతో పాటు కలెక్టర్ నిధుల నుంచి ప్రత్యేక ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో కౌన్సిలర్ రాము తదితరులు పాల్గొన్నారు.
Next Story






