తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. EPC టెండర్ల పర్యవేక్షణకు కొత్త కమిటీలు

by Kema Shiva Kumar |

మేజర్ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. EPC టెండర్ల పర్యవేక్షణకు కొత్త కమిటీలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మున్సిపల్ పరిపాలన రంగంలో పారదర్శకత, వేగవంతమైన అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (EPC) పద్ధతిలో చేపట్టే భారీ ప్రాజెక్టుల టెండర్ల పర్యవేక్షణ కోసం కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తూ (Reorganized) నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన కీలక మున్సిపల్ కార్పొరేషన్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టే రూ.10 కోట్లకు పైబడిన భారీ అభివృద్ధి పనుల కోసం కొత్త పర్యవేక్షణ కమిటీలను నియమించింది.

పనుల్లో పారదర్శకత కోసమే..

రూ.10 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ ఉన్న సివిల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనుల టెండర్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడం, నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయడం, ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా చూడటం ఈ కమిటీల బాధ్యత. గతంలో ఉన్న నిబంధనలను సమీక్షించిన అనంతరం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కమిటీల నిర్మాణంలో మార్పులు చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. తాజా నిర్ణయంతో ఎంఎంసీ, సీఎంసీ పరిధిలో సాగనున్న రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర మౌలిక వసతుల కల్పన పనుల్లో జాప్యం తగ్గుతుందని, టెండర్ల ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story