- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) మ్యాచ్‌లకు ‘ఫ్రీ ఎంట్రీ’
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL 2026) మ్యాచ్‌లను చూసేందుకు క్రికెట్ అభిమానులకు, ఐడీ కార్డులున్న విద్యార్థులకు ఏసీఏ ఉచిత ప్రవేశాన్ని కల్పించింది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) సరికొత్త కానుకను అందించింది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’ (APL 2026) సీజన్ మ్యాచ్‌లను నేరుగా మైదానంలో చూసేందుకు అభిమానులకు, విద్యార్థులకు, ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. లీగ్‌కు మరింత ఆదరణ పెంచడంతో పాటు స్థానిక వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మూడు నగరాల్లో క్రికెట్ సందడి..
గత సీజన్లలా కాకుండా ఈసారి ఏపీఎల్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తూ మూడు వేర్వేరు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మైదానాలలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం వేదికగా జూన్ 9 నుండి జూన్ 13 వరకు తొలి దశ మ్యాచ్‌లు. వైఎస్ఆర్ కడప జిల్లా స్టేడియంలో జూన్ 17 నుంచి జూన్ 21 వరకు రెండో దశ మ్యాచ్‌లు, మంగళగిరి అంతర్జాతీయ స్టేడియం (గుంటూరు)లో జూన్ 24 నుండి జూన్ 30 వరకు చివరి దశ మ్యాచ్‌లతో పాటు గ్రాండ్ ఫైనల్ ఇక్కడే నిర్వహించనున్నారు.
మొత్తం 7 ఫ్రాంచైజీ జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్‌లో వేలాది మంది అభిమానులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తుండగా.. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు తమ ఐడీ కార్డులు (ID Cards) చూపిస్తే, ప్రత్యేక పాస్‌ల ద్వారా స్టేడియంలోకి నేరుగా ఉచిత ప్రవేశం పొందే వీలు కల్పించారు. కడప, మంగళగిరి స్టేడియాల్లో కొత్తగా ఫ్లడ్‌లైట్లను కూడా ఏర్పాటు చేసి డే-నైట్ మ్యాచ్‌లుగా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడలేని వారి కోసం ‘జియో సినిమా’ యాప్, ‘స్టార్ స్పోర్ట్స్’ నెట్‌వర్క్‌లలో లైవ్ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి.






