స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. సీఎస్‌కు నోటీసులు

by Vemula.Srinu Prasad |

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై చలించిపోయిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది..

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్.. సీఎస్‌కు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్‌ప్లాంట్‌(Visakha Steel Plant)లో జరిగిన ప్రమాదం(Accident)లో 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై చలించిపోయిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. అయితే ఈ ప్రమాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసింది. రాష్ట్ర సీఎస్ జి.సాయి ప్రసాద్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు పరిహారానికి సంబంధించిన చెల్లింపుల వివరాలను సమర్పించాలని పేర్కొంది. అదే విధంగా క్షతగాత్రులపై పరిస్థితిపైనా ఎన్‌హెచ్‌ఆర్సీ ఆరా తీసింది.

Next Story