ఖమ్మం మైనర్ అత్యాచార ఘటన.. బాధితురాలిని పరామర్శించిన మంత్రి తుమ్మల

by Ajay Maddhiboyina |

ఖ‌మ్మంలో మైన‌ర్ బాలిక‌పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న బాధితురాలిని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు పరామ‌ర్శించారు. నిందితుడు రెండో అంత‌స్తు నుండి బాలిక‌ను తోలివేయ‌డంతో తీవ్ర‌గాయాలు అయ్యాయ‌ని చెప్పారు.

ఖమ్మం మైనర్ అత్యాచార ఘటన.. బాధితురాలిని పరామర్శించిన మంత్రి తుమ్మల
X

దిశ‌, వెబ్ డెస్క్: ఖ‌మ్మంలో మైన‌ర్ బాలిక‌పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న బాధితురాలిని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు పరామ‌ర్శించారు. నిందితుడు రెండో అంత‌స్తు నుండి బాలిక‌ను తోలివేయ‌డంతో తీవ్ర‌గాయాలు అయ్యాయ‌ని చెప్పారు. బాలిక కాళ్లు, చేతుల‌కే కాకుండా వెన్నుముక‌కు సైతం గాయాలు అయ్యాయ‌ని చెప్పార‌న్నారు. కోలుకోవ‌డాన‌కి క‌నీసం రెండు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు. ఎంత ఖ‌ర్చు అయినా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తామ‌ని, ప్ర‌భుత్వ‌మే ఖ‌ర్చు భ‌రించి వైద్యం అందిస్తుంద‌ని అన్నారు. బాధితురాలి కుటుంబానికి కూడా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఇది మాన‌వ‌మృగం లాంటి వ్య‌క్తి చేసిన దుర్మార్గ‌మైన చ‌ర్య అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉంటే జూన్ 6న 12ఏళ్ల మైనర్ బాలికపై బీఆర్ఎస్ కార్యకర్త మహ్మద్ గౌస్ లైంగిదాడికి పాల్పడి, అనంతరం రెండో అంతస్తు నుండి కిందకి తోసేశాడు. బాలిక తల్లిదండ్రులు అపార్ట్మెంట్ కు వాచ్ మెన్ గా ఉంటూ అక్కడే పనులు చేసుకుంటూ ఉండగా, గౌస్ కూడా అదే అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన కామాంధుడు లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసేందుకు పై నుండి తోసేశాడు. మొదట ప్రమాదవశాత్తూ కింద పడిందని భావించిన తల్లి దండ్రులు బాలికను ఆస్పత్రికి తరలించగా అత్యాచారం జరిగినట్టు తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. అతడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story