- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసరగొండ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి
by Batti.Sumithra |
దామెర మండలంలోని పసరగొండ క్రాస్ వద్ద జాతీయ రహదారి పై రెండు లారీలు ఢీకొనడంతో ఓ డ్రైవర్ మృతి చెందాడు.

X
దిశ, దామెర : దామెర మండలంలోని పసరగొండ క్రాస్ వద్ద జాతీయ రహదారి పై రెండు లారీలు ఢీకొనడంతో ఓ డ్రైవర్ మృతి చెందాడు. డివైడర్‌లో ఉన్న చెట్లకు నీరు పోస్తున్న లారీని మరో లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతడు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రెండు లారీలు ఢీకొన్న ఘటనలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న దామెర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






